free html hit counter
మాయ నుంచి తప్పించగల శక్తి యోగ

అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. పదేళ్ళ కిందట మీరు తీయించుకున్న ఫోటోతో దాన్ని పోల్చి చూసుకోండి. ఆ ఫోటోను, ఇరవై ఏళ్ళ కిందట మీరు తీసుకున్న ఫోటోతో పోల్చండి. ఇప్పుడు మీరు పదేళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నారో ఊహించుకోండి. మీరు ఎలా ఉంటారు? ఆ ఆలోచన మిమ్మల్ని భయపెడుతుందా? ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, మీ శ్వాసను లెక్కించండి.

ఒకవేళ నిమిషానికి పదిసార్ల కన్నా తక్కువ ఉంటే, మూడు చిత్రాల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. మీరు యోగలో ఉన్నారు. తదుపరి వ్యాసాన్ని విస్మరించండి.

ఒకవేళ శ్వాస తీసుకోవడం ఎక్కువగా ఉంటే, మీ ముఖం వృద్ధాప్య లక్షణాలను ప్రదర్శించడమే కాక, మీలో ఉన్న అనేకానే వ్యాధులకు మీరు రకరకాల మందులు వాడుతున్నారన్న మాట. మీ వయసు ఇప్పుడు ఎంతైనా సరే, మీరు జాగృతమై, యోగలోకి ప్రవేశించాలి.

యోగ అంటే చెట్ల చుట్టూ పరిగెడుతూ నాట్యం చేయడం, క్లిష్టమైన భంగిమలను చేయడం లేక జంతువులలాగా శ్వాసను వేగంగా పీల్చడం కాదు. అవన్నీ కూడా వ్యాయామం చేస్తున్న జిమ్నాస్ట్‌ లక్షణాలు, యోగివి కాదు. యోగికి తన శరీరం, అవయవాలపై నియంత్రణ ఉంటుంది, నిదానంగా, లయబద్ధంగా ఊపిరి పీలుస్తాడు, పరమవృద్ధుడు అయ్యే వరకూ కూడా తేజస్సును, వెలుగును కలిగి ఉండటమే కాదు, తన ఇంద్రియాలపై నియంత్రణను కలిగి ఉంటాడు. యోగి ఇంద్రియాలను, దానితో వచ్చే సుఖాలను త్యజించడు. వాటిని అధిగమించి ఉన్నతమైన సుఖాల కోసం వెడతాడు. ఎందుకంటే యోగ అనేది సమస్త సృష్టికి సంబంధించిన శాస్త్రం, అది ప్రపంచానికి, దాని ఆవల ఉన్నదానికి ద్వారం. అది ఇంద్రియాల అనుభవం, ఉన్నతమైన ఇంద్రియాల లోతైన సుఖంలోకి ప్రవేశించడం. యోగలో ఆహార నియమాలు, కర్మకాండలు, జీవనశైలులు ఉండవు. యోగ మీకు స్వేచ్ఛను ఇస్తుంది.

సరైన పద్ధతిలో యోగను సాధన చేస్తున్న వారు అతీంద్రియ శక్తులను అభివృద్ధి చేసుకోవడమేగాక, తేజస్సుతో, రోగరహిత శరీరాన్ని కలిగి ఉంటారు. సనాతన క్రియ సాధకుల గురించి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ప్రముఖ వైద్యులు అన్న మాటలు..

‘యాంటీ ఏజింగ్‌పై ప్రామాణికమైన, అద్భుతమైన థీసిసే కాదు దాని సంక్లిష్టతలను సరళీకరించారు’ – డా|| కె.కె. సింగ్‌, న్యూరో ఫిజీషియన్‌ (సనాతన క్రియ పద్ధతులపై)

‘వ్యక్తుల ఫోటోలను చూసి వారి రోగలక్షణాలను మీరు (ధ్యాన్‌ ఆశ్రమ్‌లోని సాధకులు) గుర్తించగలిగారు’- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ( సనాతన క్రియ సాధకుల ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించిన అనంతరం).

(యోగి అశ్విని ధ్యాన్‌ ఫౌండేషన్‌ ఆధ్యాత్మిక మార్గదర్శి, అధిపతి.)

నాడీ శోధన ప్రాణాయామo (Alternate Nostril Pranayamam in Yoga)

సన్నటి నాళాల( నాడీ ) శుధ్ధి

శ్వాసను సక్రమ పరిచేందుకు యోగాలో టెక్నిక్‌లు ఉన్నాయి. ఆ టెక్నిక్‌లు ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ వ్యాధులను దూరంగా ఉంచుతాయి. శ్వాసపై ధ్యౄస నిలిపి నియంత్రించుకునేందుకు సనాతన క్రియ ఒక సులభమైన మార్గం. ఈవ్యాసంలో ఆలోచన(మెదడు),శరీరం, ఆత్మను శుద్ధి చేయగల నాడీ శోధనం అనే శక్తిమంతమైన ప్రాణాయామ గురించి తెల్సుకుందాం. మన శరీరంలో ప్రాణ వాయువు ప్రవహించే సన్నని నాళాలు (చానెల్స్‌)నే నాడులుగా పేరొ&ంటాం. శోధన అంటే శుద్ధి చేయడం అని అర్ధం. నాడా వ్యవస్థలో (నాడులలో) ఏమైనా ఆటంకాలు ఉంటే ప్రాణ వాయువు ప్రసారానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రాణ ప్రసారం సక్రమంగా లేకపోవడం వల్ల అనేక వ్యాధులకు దారితీస్తుంది. ‘ నాడీ శోధనం’ లో ఈద -ఇడిఎ(సుషుమ్నా నాడికి ఎడమవైపున ఉండే చల్లటిి-కోల్డ్‌ నాడి) మరియు పింగళ (సుసషుమ్నా నాడికి కుడివైపున ఉండే వేడి-హాట్‌ నాడి) నాడులు కవ్వం చిలికే కర్రల్లా పనిచేస్తూ వెన్ను బేస్‌లో సంఘర్షణ లేక రాపిడితో వేడిని పుట్టిస్తాయి. ఈ వేడి సుషుమ్నా నాడి ద్వారా పెరుగుతూ అక్కడినుంచి శరీరమంతా వ్యాపించి శరీరంలోని అన్ని నాడులలోకి ప్రవేశించి వాటిలో ఉన్న భారాన్ని తొలగించి వాటిని శుద్ధి చేస్తుంది. నాడులు కుంచించుకుపోవడం, అవిద్య లక్షణాలు శరీరం సూక్ష్మమైన శక్తులు, ప్రాణవాయువును గ్రహించకుండా దూరంగా ఉంచుతాయి.

నాదషడీ శోధన ప్రాణౄయామానికి సిద్ధమయ్యేందుకు ..

1. నిటారుగా కూర్చోవాలి. వజ్రాసనంలో ఉంటే మంచిది. లేకపోతే ఎలాంటి ఆసరా లేకుండా వెనుక భాగాన్ని పూర్తిగా నిటారుగా నిలపాలి.

2. మధ్యవేలిని కనుబొమల మధ్యన ఉంచండి. ఉంగరం వేలితో ఎడమ వైపు ముక్కు, బొటనవేలితో కుడివైపు ముక్కు పై ఉంచండి.

3. కుడివైపు ముక్కును బొస్త్రంటన వేలితో మూసి ఎడమ వైపు ముక్నుఉంచి గాలిని లోపలికి పీల్చి, కుడి ముక్కునుంచి గాలిని వదలండి. మళ్ళీ ఈ సారి కుడివైపు నుంచి గాలిని లోపలికి పీల్చి ఎడమవైపు ముక్కు నుంచి గాలిని నవదలాలి- ఇది ఒక రౌండ్‌ లేక సైకిల్‌.

4. లోపలికి ఊపిరి పీల్చినప్పుడు పొట్ట గాలితో నిండి బయటికి నెట్టివేయబడుతుంది. ఈ సమయంలో గొంతులో నుంచి హిస్‌ అనే ధ్వని ( ఉజ్జాయ్‌ ప్రాణాయామంలో మాదిరి) రావాలి. ఊఇరి వదిలినప్పుడు పొట్టలోపలికి లాగుతుంది.

లోపలికి నాలుగుసార్లు, బయటికి పన్నెండుసార్లు ఊపిరి పీల్చాలి.ఒక క్రమమైన పద్దథిలో ఉండాలి లెక& మీద దష్ఠి ఉండకూడదు. మొదటిలా 14 సైకల్‌నసతో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్ళాలి.

ఈ సనాతన క్రియ అభ్యాసం ద్వారా శ్వాసకోశ వ్యాధులనుంచి విముక్తి పొందినవాఉ ధ్చాన ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు. ఆరునెలలుగా ఒక్క ఇన్‌హేలర్‌ కొనకుండానే నీకు ఆస్త్మా ఎలా తగ్గిందని ఒక మందుల షాపు వ్యక్తి( కెమిస్ట్‌) అడిగినప్పుడు మాత్రమే తనకు ఉన్న తీవ్రమైన ఆస్త్మా వ్యాధఙ తగ్గిందని ఒక విద్యార్ధిని గ్రహించగలిగింది. వాస్తవానికికి ఆమె కొద్ది రోజులుగా ఆశ్రమంలో సనాతన క్రియ అభ్యాసం(ప్రాక్టీస్‌) చేస్తోంది.

గమనిక : చక్కటి గాలి, వెలుతురు వచ్చే గదిలోనే ప్రాణౄయామం ప్రాక్టీస్‌ చేయాలి. రణగోణ ధ్వనులు, అపరిభ్ర వాతావరణంలో ప్రాణాయామం ప్రాక్టీస్‌ చేయవదుద్ద. అలాగే ప్రాణాయామం చేసేప్పుడు ఎయర్‌ కూలర్‌, ఫ్యాన్‌ గాలికి ఎదురుగా కూర్చోకూడదు. గురువు పర్యవేక్షణలోనే ప్రాణౄయామాలు చేయడం అవసరం. గురువు పర్యవేక్షణ లేకుండా గానీ, టీవీ ప్రోగ్రాములు చూసి గానీ, ఎక్కడైనా పుస్తకాల్లో చదవిన విషయాల ఆధారంగాసద గానీ ప్రాణాయామాలు చేస్తే దీర్ఘ కాలంలో శరీరానికి కోలుకోలేని నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యంటీ ఏజింగ్‌ పై ఆయనపరాసిన సిద్ధా:త గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది.డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదామరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.