free html hit counter
సూక్ష్మ జీవులపై పోరాటం, జల్‌నేతితో శరీరంలోని విష పదార్ధాలు తొలగింపు

నేటి ప్రపంచంలో బాహ్యరూపానికి ప్రాధాన్యం  పెరగడంతో ప్రతొక్కరూ చక్కటి శరీరాకృతి, మెరిసే చర్మం, చక్కని ముఖంతో అందంగా కనబడాలిని కోరుకుంటున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) మాత్రం లాభపడుతున్నాయి. మానసరవాళి మాత్రం భ్రమలతో వెర్రి తిండి, రసాయనాలతో కూడిన సౌందర్య సాధనాలు వాడుతూ మహాదానందంగా వాటలిని వాడుతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు.

రోజు వారీఉత్పత్తుల్లో వాడే వివిధ రసాయనాలు, శరీరంపై వాట దుష్ప్రభావాలు, వాటిని తొలగించుకునే మార్గాలును నేను నబీపరాసిన ‘ సనాతన క్రియ- ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ అనే పుస్తకంలో వివరించాను. మనం రోజూ శరీరాన్ని లోపల వెలుపల శుభ్ర పర్చుకోవడమే కాదు వ్యాధులను దూరంగా ఉంచే ప్రక్రియను కూడా అలవాటు చేసుకోవడ అవసరం.

ప్రయోగాత్మకంగా పరీక్షించబడిన ఒక ‘ శుద్ధ ప్రక్రియ( టెక్నిక్‌)ను పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తాను. ముఖ్యంగా శీతాకాలంలో’జల్‌ నేతి’ అనే ఈ టెక్నిక్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

jalnethi-nasika-shuddi

ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వేద పురుషులు మన కందించిన పురాతన వేద సాంకేతిక ప్రక్రియే ఈ’జల్‌ నేతి’ లేక నాసిక శుద్ధి టెక్నిక్‌. దీనిని ఇప్పుడు పాశ్చాత్యులు ‘ నాసల్‌ ఇరిగేషన్‌’ పేరుతో ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ప్రయోజనాలు: ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే ఫ్లూ వైరస్‌లుశరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించి ప్రాణాంతక వ్యాధుల బారిన పడవేయకముందే దాన్ని తరిమేయడంలో సమర్ధంగా పనిచేస్తుంది ఈ టెక్నిక్‌. రోజువారీ జల్‌ నేతి ప్రక్రియను అనుసరిఏ్త గొంతు, ముక్కు ఇన్ఫెక్షన్‌ల పై పోరాడే రక్షణ శక్తి వ్యవస్థ శరీరంలో వృద్ధి చెందుతుంది. కాలుష్య వాతావరణంలో ఎక్కువగా ప్రయాణించే వారు, ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధుల వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి కూడా ఈ టెక్నిక్‌ ఎంతో ఉపశమనం (రిలీఫ్‌) కలిగించడమే నకాక అలాటి అలర్జీలపై విజయవంతంగా పోరాడే శక్తిని కలిగిస్తుంది. ఈ టెక్నిక్‌ కేవలం శుద్ధి కోసం మాత్రమే కాదు వయసుపై కూడా పనిచేసి చురుకుగా ఉంచుతుంది.

ఎలా చేయాలి ? – ఒక నేతి గిన్నెలో 500 ఎంఎల్‌ గోరువెచ్చని నీటిని నతీసుకుని ఒక టీ స్పూన్‌ నల్ల, రాతి నుప్పును, కొంచెం పసుపును కలపండి. సమానంగా నిలబడి కొద్దిగా ముందుకు వంగి 45 డిగ్రీల కోణంలో తలను ఎడమవైపునకు వాల్చండి. ఇప్పుడు నేతి గిన్నె నాజిల్‌ను కుడి ముక్కులో ఉంచండి. నోటితో ఊపిరి పీల్చుకుంటూ నేతి గిన్నెను కుడి ముక్కులోకి కొద్దిగా వంచండి. అప్పుడు ఆ గిన్నెలోని ద్రావణం కుడి ముక్కు లోపలికి వెళ్ళి ఎడమ ముక్కునుంచి బయటికి వస్తుంది.. పవృద్ధి చెందు

ప్రయోజనాలు: ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయండి. తర్వాత శ్వాస మామూలుగా పీల్చుకోండి. ముక్కు లోపల పేరుకు పోయి వ్యాధి కారకంగా ఉన్న సూక్ష్మ పదార్ధాలన్నింటిని శుభ్రంగా తొలగించేందకు గాను పైన పేర్కొన్న ద్రావణానికి సెలైన్‌ వాటర్‌ ఉత్తమం. పసుపు వయాంటీ సెప్టిక్‌, వ్యాధఙ వ్యాప్తి నిరోధకంగా పనిచేస్తుంది.

ఈ ప్రక్రియ తర్వాత ముక్కులో కొన్ని చ్కుల దేశృయ నేతిని వేయండి. దీని తర్వాత 10-15 నిమిషాల పాటు నేల మీద పడుకోవాలి. ఇలా జల్‌ నేతి విధాానాన్ని రోజూ చేయడం వల్ల ముక్కులోని వ్యాధి కారకాలన్నీ తొలగిపోయి జలుబు వంటి రుగ్మతలు దూరంగా ఉంటాయి. ధ్యాన ఆశ్రమంలో ఉండే సాధకులందరికీ ఇది అనుభవమే.

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యాంటీ ఏజింగ్‌ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదామరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.