free html hit counter
ఆయుర్వేదంతో మైగ్రేన్‌ ను జయించండి

మైగ్రేన్‌ ను ఆయుర్వేదంలో ‘ అర్ధావభేద'(ఒకవైపు వచ్చే తలనొప్పి),అనంత వాత'(తలంతా వచ్చే నొప్పి) అనే రెండురకాలుగా చెబుతారు.అనంతవాత నొప్పి తీవ్రంగా (క్లాసిక్‌ మైగ్రేన్‌) ఉటుంది.ఇది పలు కారణాల వల్ల వస్తుంది. కోపం, కలత చెందడం, నిరుత్సాహం, సంక్షోభ పరిస్థితులు, అజీర్ణం, కొన్ని రకాల ఆహార పదార్ధాలు శరీరానికి పడక పోవడం. ఒక్కోసారి వాతావరణం సరిపడకపోయినా ఈ వ్యాధి రావడానికి కారణమవుతుంది.రక్తపోటు(బ్లడ్‌ప్రెజర్‌), ఆస్త్మా వ్యాధులకు వాడే కొన్ని మందులు వల్ల కూడా మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకు గల కారణాలును మనమే గమనించుకోవాలి. కారణాలు ఏమైనప్పటికీ చాలా మైగ్రేన్‌ కేసుల్లో తీవ్రమైన ‘పిత్త దోష’మే మూలకారణంగా కనబడుతుంది.పిత్త దోషం జీర్ణశక్తిని దెబ్బ తీయడం వలన ‘ఆమ’ రసాలు ఉత్పత్తి తో మెదడుకు చేరే నాడులలో మలిన పదార్ధాలు పేరుకుపోవడంతో ‘మైగ్రేన్‌’ నొప్పి వస్తుంది.

మైగ్రేన్‌ను తొలగించుకోవడానికి శరీరంలో అధికంగా ఉండే లక్షణాలను ముందుగా తొలగించాలి ‘ అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే నానుడిని గుర్తుంచుకుని జీవన విధానాన్ని మార్చుకుని సాధారణ స్థితిలో ఉంచుకోవాలి. తక్షణ నొప్పి నివారణ మందులు( పెయిన్‌ కిల్లర్స్‌) వాడడాన్ని మానుకోవాలి. ఎందుకంటేే అవి సమస్యను మరింత పెంచుతాయి. ఒక్కసారి వాటి ప్రభౄవానికి లోనైతే తరచూ నొప్పి రావడం, ఆ మందులు వాడడమే సరిపోతుంది. దీనికి బుదులుగా వెంటనే ఉపశమనం కలిగించేందుకు వెలుతురు పడని గదిలో ప్రశాంతంగాా కింద పడుకుని ఒక ‘ఐస్‌ ప్యాక్‌’ను ( చల్లటి తడిగుడ్డ వంటివి) మెడ, నుదురు, కణతలు పై ఉంచుకోవాలి.అంటే ఒక విధంగా కాపడంలా చేయాలి. నుదుటి పైన శొంఠి గంధంలా ( జింజర్‌ పేస్ట్‌) చేసే పట్టీలా వేసుకోవాలి. దీని వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.

migrainఆరోగ్య చిట్కా ( హెల్త్‌ టిప్‌) : మైగ్రేన్‌ నుంచి మరింత ఉపశమనం కలిగేందుకు ‘ జిలోయ్‌’ రసాన్ని ఒక టీ చెంచా( స్పూన్‌) తేనేతో కలిపి తాగాలి. లేకపోతే మూడుగ్రాముల ధనియాఉ, ఐదు గ్రాముల లావెండర్‌ పూలు,ఐదు నల్ల మిరియాలు, ఐదు బాదం పప్పులు తీసుకోవాలి. బాదం పప్పులును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపై నున్న పొట్టును తీసేయాలి. పైన చెప్పిన ఈ పదార్ధాలన్నింటిని నీరు పోసి మెత్తగా చేసకుని దానిని వడగట్టి సూర్యోదయానికి ముందే తీసుకోవాలి..

శరీరంలో హానికారక పదార్ధాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేయడమే కాక వ్యాధులను తరిమేయగల సమతుల స్థితిలో శరీరాన్ని ఉంచగలిగే సనాతన క్రియ లోని కొన్ని టెక్నిక్‌లను వివరించాను. నాడీ శోధన ప్రాణాయామం నాడులను శుద్ధి చేసి ప్రాణ వాయువును మెరుగుపరచేందుకు దోహద పడుతుంది.. దీంతోఒత్తిళ్ళు, తలనొప్పులు పోయి ఆరోగ్యవంతులు గా తయారవుతారు.

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి.యాంటీ ఏజింగ్‌ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైమెన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాన్‌ఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదా మరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.